
హైదరాబాద్: జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగంలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఆస్తిపన్ను తగ్గించేందుకు 36వేల లంచం తీసుకుంటూ కూకట్ పల్లి బిల్ కలెక్టర్ ఏసీబి అధికారులకు చిక్కాడు. జీహెచ్ఎంసీ కూకట్ పల్లి బిల్ కలెక్టర్ మహేంద్ర నాయక్ 36 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు.
జగద్గిరిగుట్టకు చెందిన రాజు ఎలక్ట్రానిక్స్ షాప్ ప్రాపర్టి ట్యాక్స్ తగ్గించేందుకు లంచం తీసుకుంటూ మహేంద్ర నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.